: సంబరాలు చేసుకుంటున్న అభిషేక్ బచ్చన్


భారత్ లో కబడ్డీ క్రీడకు ఆదరణ కల్పించేందుకు ప్రారంభించిన ప్రొ కబడ్డీ లీగ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు టైటిల్ నెగ్గింది. దీంతో, ఆ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ సంబరాల్లో మునిగిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో పింక్ పాంథర్స్ జట్టు 'యు ముంబా' జట్టుపై విజయం సాధించింది. దీనిపై జూనియర్ బచ్చన్ ట్విట్టర్లో స్పందిస్తూ, "గతరాత్రి అంతా ఓ కలలోలా జరిగిపోయింది. టైటిల్ గెలుస్తామని అనుకోలేదు. కుర్రాళ్ళ కఠోర శ్రమ, కోచ్ తో పాటు ఇతర సహాయక సిబ్బంది కృషి కారణంగా విజయం సాకారమైంది" అని పేర్కొన్నారు. తన జట్టుకు మద్దతిచ్చిన అభిమానులందరికీ అభిషేక్ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News