: తెలుగువారి గుండెలోతుల్లో బాపు స్థానం సంపాదించారు: బాలకృష్ణ


పుట్టడం గిట్టడం సహజమే కానీ, తన తండ్రి ఎన్టీఆర్, బాపు గార్లలా చిరస్థాయిగా నిలవగలిగిన వారు అతికొద్దిమందే ఉంటారని ప్రముఖ తెలుగు సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. చెన్నైలో బాపు పార్థివదేహాన్ని సందర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగువారి గుండెలోతుల్లో బాపుగారు చిరస్థానం సంపాదించారని అన్నారు. ప్రతి తెలుగింట బాపు ఉంటారని ఆయన పేర్కొన్నారు. బాపు లాంటి గొప్ప వ్యక్తితో తన తండ్రి, తాను పని చేశామని ఆయన తెలిపారు. బాపు లేని లోటు పూడ్చలేమని ఆయన పేర్కొన్నారు. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

  • Loading...

More Telugu News