: పాకిస్థాన్ తో చర్చలుండబోవు: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ


పలుమార్లు భారత సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ, తీరు మార్చుకోని పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. వచ్చే నెలలో నేపాల్ లో సార్క్ దేశాల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా పాక్ తో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరపబోతున్నారంటూ వస్తున్న వార్తలను హోంమంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యాలయం ట్వీట్ చేసింది. "పాక్ తీవ్రవాదాన్ని ఆపనంతవరకు ఎలాంటి చర్చలు సాధ్యం కావు" అని పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 18, 19న నేపాల్లో జరగనున్న సార్క్ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి హాజరవుతారు.

  • Loading...

More Telugu News