: బాపు మృతికి ఏపీ అసెంబ్లీ నివాళి
ప్రముఖ దర్శకుడు బాపు మృతికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ఆయనకు సంతాపం తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగిన బాపు తెలుగు అక్షరాన్ని తేజోవంతం చేశారని, పురాణ పాత్రలకు తన చిత్రాల ద్వారా ప్రాణం పోశారని కీర్తించారు. అధికారిక లాంఛనాలతో బాపు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. విజయవాడలోని కోస్టల్ మ్యూజియంకు బాపు పేరు పెడతామని వెల్లడించిన సీఎం చంద్రబాబు... కొత్త రాజధానిలో బాపు-రమణల పేరిట ప్రపంచస్థాయి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేగాక గోదావరి తీరాన వారిద్దరి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు.