: ఆంధ్రప్రదేశ్ మెట్రో ప్రాజెక్టుల సలహాదారుగా శ్రీధరన్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లోని మెట్రో ప్రాజెక్టుల సలహాదారుగా ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ శ్రీధరన్ నియమితులయ్యారు. ఆయన నియామకంపై మరో రెండు రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న శ్రీధరన్ ఈ ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రభుత్వం వీలైనంత త్వరగా ప్రారంభించాలనుకుంటోంది. ఇందుకోసం ముందుగా ప్రతిపాదిత నగరాల్లో ఆయనతో పరిశీలన చేయించనుంది.

  • Loading...

More Telugu News