: రాష్ట్రంలో ఏం జరిగినా 'వైఎస్' అంటున్నారు: జగన్ ఆవేదన
రాష్ట్రంలో ఏ చిన్న తప్పిదం జరిగినా దానిని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆపాదిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ మరణించి ఐదేళ్లయిందని, ఎన్నికలు జరిగి మూడు నెలలైందని అన్నారు. టీడీపీ నేతలు అయినదానికి, కానిదానికి ఆయనను నిందించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గత మూడు నెలల కాలంలో చోటుచేసుకున్న అంశాలు కూడా ఆయనకే ఆపాదించడం సమంజసమా? అని జగన్ ప్రశ్నించారు.