: భారత్ లో ఇళ్ల ధరలు తగ్గాయి!


మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ వివిధ రంగాల్లో దూసుకుపోతోంది. రెండున్నరేళ్ల తర్వాత జీడీపీలో భారీ వృద్ధి నమోదు చేసుకుంది. అంతేగాక, పారిశ్రామిక రంగంలో కూడా జోష్ కనిపిస్తోంది. అయితే, రియాల్టీ రంగం మాత్రం నానాటికీ తిరోగమన దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. పలు దేశాల్లో ఈ రంగం వృద్ధి బాటనే నడుస్తున్నప్పటికీ, భారత్ లో మాత్రం 9.1 శాతం ధరలు పడిపోయాయి. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, సమాచారం అందుబాటులో ఉన్న 51 దేశాలకు గాను 33 దేశాల్లో రియాల్టీ రంగం దూసుకుపోతోంది. 19 దేశాల రియాల్టీ రంగంలో తిరోగమన వృద్ధి నమోదవుతోంది. వీటిలో భారత్ లోనే అత్యధిక తిరోగమన వృద్ధి నమోదైందని ఆ నివేదిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News