: తలసాని సైకిల్ దిగి కారెక్కనున్నారా?


సనత్ నగర్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారనున్నారా? నేడు ఉదయం 10 గంటలకు తలసాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమవనున్నారు. కాగా, గత కొంత కాలంగా తలసాని పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తలసాని టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, పార్టీ నేతలతో అంటీ ముట్టనట్టు ఉండడం ఊహాగానాలకు ఊపిరి పోసింది. ఇదిలా వుంటే, హైదరాబాదులోని పద్మారావునగర్ డివిజన్ లో ఐడీహెచ్ కాలనీలో ఇళ్లు శిధిలావస్థకు చేరి వర్షాలకు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తలసాని టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైందని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటుండగా, ఆయనకు పార్టీ మారే ఆలోచన లేదని, నియోజకవర్గ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయన కలుస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News