: రేపు బాపు అంత్యక్రియలు
అనారోగ్యం కారణంగా కన్ను మూసిన దిగ్గజ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు అంత్యక్రియలు రేపు జరుగనున్నాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ లోని శ్మశాన వాటికలో బాపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బాపు పెద్ద కుమారుడు వెంకట్ రమణ తెలిపారు. జపాన్ నుంచి బాపు చిన్న కుమారుడు వేణుగోపాల్ నేటి రాత్రికి చెన్నై చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తరువాతే అంత్యక్రియలు జరుగనున్నాయి. నేడు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు, చిత్రకారులు, అభిమానులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించనున్నారు.