: ఈ రోజు తెలుగుజాతికి నిజంగా దుర్దినం: మండలి బుద్ధప్రసాద్
తెలుగు చిత్రసీమ గర్వించదగిన మహోన్నత దర్శకుడు బాపు కన్నుమూయడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. ఆయన మృతికి తన సంతాపం తెలియజేశారు. నేడు తెలుగుజాతికి నిజంగా దుర్దినం అని పేర్కొన్నారు. ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని విచారం వ్యక్తం చేశారు. కాగా, బాపు మరణంపై అమెరికాలోని సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.