: హైదరాబాదులో భారీ వర్షం
హైదరాబాదు నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కూడళ్ళ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాగా, అల్పపీడనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో, మరో రెండ్రోజులపాటు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.