: మరికొద్ది రోజుల్లో ఈ రాకుమారుడి పంట పండనుంది!


బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ పంట పండనుంది. ఆయన తన 30వ జన్మదినోత్సవాన్ని సెప్టెంబర్ 15న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తల్లి ప్రిన్సెస్ డయానా వారసత్వ సంపద రూపేణా హ్యారీ రూ. 100 కోట్ల ఆస్తికి సొంతదారు కానున్నారు. డయానా 1997లో ఓ కారుప్రమాదంలో కన్నుమూశారు. ఆమె వీలునామాలో... కుమారులిద్దరికీ పాతికేళ్ళు వచ్చిన తర్వాత ఆస్తి అప్పగించాలని పొందుపరిచారు. అనంతరం దాంట్లోని వయసు నిబంధనను 30 ఏళ్ళుగా మార్చారు. ఈ నిబంధన అనుసరించి హ్యారీ సోదరుడు విలియం 2012లోనే వంద కోట్ల ఆస్తి దక్కించుకోగా, మరికొద్ది రోజుల్లో హ్యారీ కూడా అపార ఆస్తికి సొంతదారవుతాడు.

  • Loading...

More Telugu News