: బెంగళూరులో 'యువరాజ్ వర్సెస్ ఉసేన్ బోల్ట్'
వరల్డ్ ఫాస్టెస్ట్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్, టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ క్రికెట్ మ్యాచ్ లో తలపడనున్నారు. అంతర్జాతీయ క్రీడా ఉపకరణాల సంస్థ పూమా బెంగళూరులో నిర్వహించే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ సెవెన్ ఏ సైడ్ మ్యాచ్ జరపనున్నారు. ఇందులో బోల్ట్, యువీ ప్రత్యర్థులుగా తలపడతారు. బోల్ట్ జట్టులో ఏస్ స్పిన్నర్ హర్భజన్ సింగ్... యువీ జట్టులో సీనియర్ పేసర్ జహీర్ ఖాన్ ఉన్నారు. ఒక్కో ఇన్నింగ్స్ కు నాలుగు ఓవర్లు ఉంటాయి. మంగళవారం సాయంత్రం నాలుగింటికి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కు చిన్నస్వామి స్టేడియం వేదిక.