: ఈసారి కోహ్లీని టార్గెట్ చేశారు!
టెస్టు సిరీస్ లో ఆరంభించిన మాటల యుద్ధాన్ని వన్డే సిరీస్ లోనూ కొనసాగిస్తున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్ళు. టెస్టు మ్యాచ్ ల సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను టార్గెట్ చేసిన ఆతిథ్య జట్టు, మూడో వన్డే సందర్భంగా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుంది. కోహ్లీ ఈ మ్యాచ్ లో అవుటై పెవిలియన్ కు వస్తుండగా, బౌలర్ బెన్ స్టోక్స్ నోరు పారేసుకున్నాడు. దీంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ బ్యాట్ చూపుతూ స్టోక్స్ కు బదులిచ్చాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకుని ఇంగ్లండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్, బౌలర్ స్టోక్స్ లను పిలిచి వారితో మాట్లాడారు. అనంతరం మ్యాచ్ కొనసాగింది.