: వెరైటీ సైకో... విడాకులివ్వకపోతే భార్య నగ్న చిత్రాలనే నెట్ లో పెడతాడట!


కట్నం కోసం కట్టుకున్న భార్యలను వేధించే మగాళ్ల కంటే ఇతను మహా ప్రమాదకారి. పెళ్లి చేసుకున్నాడు. నెల రోజులు బాగానే కాపురం చేశాడు. అంతే, విడాకులిమ్మంటూ భార్యను నిత్యం వేధించుకుతినడం ప్రారంభించాడు. విడాకులివ్వకపోతే, 'నీ నగ్న చిత్రాలను నెట్ లో పెడతా'నంటూ బెదిరిస్తున్నాడు. దీంతో కంగుతిన్న ఆ భార్యామణి, పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు, బాలానగర్ రాజు కాలనీకి చెందిన భాస్కర్, ఉప్పల్ కు చెందిన యువతి ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలోనే దంపతులయ్యారు. నెల రోజుల పాటు భాస్కర్, భార్యతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత విడాకులివ్వమంటూ వేధించడం ప్రారంభించాడు. తనకు విడాకులిస్తే, నెలకు లక్ష రూపాయలు సంపాదించే యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో విడాకులకు ససేమిరా అన్న భార్యను మరో విధంగా బెదిరించడం మొదలెట్టాడు. పడక గదిలో ఉండగా, భార్యకు తెలియకుండానే ఆమె నగ్న చిత్రాలు తీసి, విడాకులివ్వకుంటే, వాటిని నెట్ లో పెడతానంటూ బెదిరించాడు. అంతేకాక, గతంలోనూ పలువురి నగ్న చిత్రాలను తీశానంటూ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించబోయాడు. దీంతో ఇక లాభం లేదని గ్రహించిన యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News