: విద్యుత్ షాక్ తో రైతు మృతి
కడప జిల్లా బోడువారి పల్లెలో మునుస్వామి అనే రైతు ఆదివారం విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అతడు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పొలం వద్ద విద్యుత్ సరఫరాలో తలెత్తిన లోపాన్ని సవరించేందుకు ట్రాన్స్ కో అధికారులు స్పందించని నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తానే స్వయంగా మరమ్మతులు చేేసేందుకు ఉద్యుక్తుడైన మునుస్వామి, విద్యుత్ షాక్ కు గురైనట్లు తెలుస్తోంది.