: మెగాసిటీగా తిరుపతి : కేఈ కృఫ్ణమూర్తి


ఆధ్యాత్మిక నగరం తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టాంపులు, రిజిష్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News