: అమెరికా వెళ్లే భారత విద్యార్థుల్లో హైదరాబాదీలదే అగ్రతాంబూలం


విద్య కోసం అమెరికా వెళ్లేందుకు ఇటీవలి కాలంలో ప్రతి భారతీయ విద్యార్థి ఆసక్తి కనబరచడం చూస్తున్నాం. ఈ విషయంలో హైదరాబాదీలు మాత్రం అందరికంటే తామే ముందున్నామని చెబుతున్నారు. గడచిన కొన్నేళ్లుగా విద్య కోసం అమెరికా వెళుతున్న విద్యార్థుల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ విషయంలో హైదరాబాదీలు ఎంతగా ఆసక్తి కనబరుస్తున్నారంటే, వీరి ముందు ఢిల్లీ, ముంబై విద్యార్థులు కూడా బలాదూరేనట! 2008-12 మధ్య అమెరికాకు విద్య నిమిత్తం వెళ్లిన భారతీయ విద్యార్థులను నగరాల వారీగా పరిశీలిస్తే, హైదరాబాద్ నుంచి 26,220 మంది విద్యార్థులున్నారట. ముంబై నుంచి వెళ్లిన విద్యార్థుల సంఖ్య మాత్రం 17,294 మంది మాత్రమే. చెన్నై 9,141 మంది విద్యార్థులతో మూడో స్థానంలో ఉండగా, 8,828 మంది విద్యార్థులతో బెంగళూరు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి 8,728 మంది విద్యార్థులు మాత్రమే అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లారట. అంటే ఢిల్లీ విద్యార్థులు హైదరాబాదీ విద్యార్థుల కంటే చాలా వెనుకబడే ఉన్నారని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

  • Loading...

More Telugu News