: నేడు కాకినాడలో ఏపీసీసీ ప్రత్యేక భేటీ


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు కాకినాడలో ప్రత్యేకంగా భేటీ కానుంది. ఏపీసీసీీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, చిరంజీవి తదితర హేమాహేమీలు పాల్గొంటున్న ఈ భేటీలో, రాష్ట్రంలో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. అంతేకాక, గడచిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి కారణాలపై కూడా దృష్టి సారించనున్నట్లు సమాచారం. అయితే, ఈ భేటీకి పార్టీ అధిష్ఠానం నుంచి ఏ ఒక్క నేత కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News