: కేరళ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివం!
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం కేరళ గవర్నర్ గా నియమితులు కానున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. కేరళ గవర్నర్ గా ఆయన పేరును మోడీ సర్కారు రాష్ట్రపతికి సిఫారసు చేసిందని, రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడటమే తరువాయని కూడా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే న్యాయ వ్యవస్థలో కీలక పదవులు అలంకరించిన ప్రముఖులు కూడా గవర్నర్ గిరీ చేపట్టేందుకు సదాశివం బాటలు వేసినట్టేనన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. యూపీఏ హయాంలో తొమ్మిది నెలల పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సదాశివం, 2జీ, కోల్ గేట్ తదితర కేసులపై వేగంగా దర్యాప్తు జరిగేలా చర్యలు చేపట్టారు. అంతేకాక పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సదాశివం సంచలన తీర్పులు వెలువరించారు.