: మరో 24 గంటలపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలుతుండడంతో మరో 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోను... తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోను భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.