: శంకర్ సినిమాలు ఫస్ట్ రోజే బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కొని చూశా: మహేష్ బాబు


‘ఆగడు’ ఆడియో వేడుకలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ... ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమాలను తాను మద్రాసులో ఫస్ట్ రోజే చూసేవాణ్ణని, బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కొని శంకర్ సినిమాలకు వెళ్లానని చెప్పారు. ఈ వేడుకకు వచ్చిన శంకర్ కు మహేష్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తమన్ ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు. ‘దూకుడు’ సినిమా తన కెరీర్ లో ఓ మైలురాయి అని, ఇప్పుడు అదే దర్శకుడు శ్రీను వైట్లతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ‘ఆగడు’ సినిమా సెప్టెంబరు 19వ తేదీన విడుదల అవుతుందని మహేష్ బాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News