: ఆయన అడిగింది లక్ష... చంద్రబాబు ఇచ్చింది 5 లక్షలు!
ఆయన వయస్సు 96 సంవత్సరాలు. ఈ వయసులో వృద్ధాప్య భారం కన్నా ఆర్థిక సమస్యల భారం ఆయనను మరింత కృంగదీస్తోంది. ఆయన సామాన్యుడు కాడు, బాల్ బాడ్మింటన్ క్రీడకు పితామహుడు, అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడుగు పిచ్చయ్య. వరంగల్ కు చెందిన పిచ్చయ్య గురించి పత్రికా కథనాలు ప్రచురితమవడంతో... చంద్రబాబు జాతీయ క్రీడా దినోత్సవానికి ఆయనకు ఆహ్వానం పంపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో ‘మీకెంత ఆర్థిక సాయం కావాలి?’ అని పిచ్చయ్యను చంద్రబాబు అడిగారు. ఆయన లక్ష రూపాయలు కావాలని అడుగగా, బాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిచ్చయ్యను సన్మానించి, ఆయన ప్రతిభను ముఖ్యమంత్రి కొనియాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని పిచ్చయ్యకు బాబు హామీ ఇచ్చారు.