: కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ సత్తా
అవినీతి అంతమే లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ లోక్ సత్తా. ఐఏఎస్ ఉద్యోగాన్ని సైతం ప్రజాసేవ కోసం తృణప్రాయంగా వదిలేసిన ఘనత ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సొంతం. ఇప్పుడా పార్టీ జాతీయ స్థాయిలో తన సత్తా పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతోంది. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో 27 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించింది. బెంగళూరు నుంచే ఆరుగురు పోటీ చేయనున్నారు.
ఇటీవలే బెంగళూరు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి అభ్యర్థి అశ్విన్ భారీగా ఓట్లు సాధించడం లోక్ సత్తాలో ఆశలు చిగురింప చేస్తోంది. కాగా, కర్ణాటక ఎన్నికల్లో పాల్గొనే తమ పార్టీ అభ్యర్థుల కోసం జేపీ ఈ నెల 20,21 తేదీల్లో బెంగళూరులో ప్రచారం చేయనున్నారు.