: కడప దర్గాలో హీరో గోపీచంద్
కడప పెద్ద దర్గాను యువ కథానాయకుడు గోపీచంద్ ఈ రోజు దర్శంచుకున్నాడు. జమ్మల మడుగు, గండికోట ప్రాంతాల్లో 'జాక్ పాట్' సినిమా షూటింగ్ కోసం వచ్చిన గోపీచంద్, కడప దర్గాకు వచ్చి, ప్రత్యేక ప్రార్ధనలు చేశాడు. ఎప్పటినుంచో ఈ దర్గాను దర్శించుకోవాలని అనుకొన్నప్పటికీ, సినిమా షూటింగులతో బిజీగా వుండటం వల్ల రాలేకపోయాననీ, అయితే కొద్ది రోజుల నుంచి గండికోటలో షూటింగ్ జరుగుతుండటం వల్ల తనకు ఈ భాగ్యం కలిగిందని ఈ సందర్భంగా గోపీచంద్ అన్నాడు.