: ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించనున్న ఆర్టీసీ
4,322 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టిందని టీఎంయూ నేతలు తెలిపారు. దీనిపై రెండ్రోజుల్లో ఆదేశాలు జారీ చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించిందని వారు చెప్పారు. 2012 డిసెంబరు 31 వరకు సర్వీసు కలిగిన వారికి క్రమబద్ధీకరణ వర్తించనుందని, మిగిలిన కార్మికులకు దశల వారీగా క్రమబద్ధీకరణ చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు.