: శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 23న తిరుమంజనం
తిరుమలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే నెల 23న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ రోజున సర్వదర్శనం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 26 నుంచి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. 30న రాత్రి 8 గంటల నుంచి గరుడ సేవ నిర్వహిస్తారు.