: మహారాష్ట్ర గవర్నరుగా విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర గవర్నరుగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ముంబై రాజ్ భవన్ లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా విద్యాసాగర్ రావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం పృధ్వీరాజ్ చవాన్, అతని మంత్రివర్గ సహచరులు హాజరయ్యారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఈ నెల 27న నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ గా సీహెచ్ విద్యాసాగర్ రావు, రాజస్థాన్ గవర్నర్ గా కల్యాణ్ సింగ్, కర్ణాటక గవర్నర్ గా వజూభాయ్ వాతా, గోవా గవర్నర్ గా మృదులా సిన్హాలను నియమించారు.