: రాణించిన బౌలర్లు...ఇంగ్లండ్ 161/6


టీమిండియా సమష్టిగా రాణిస్తోంది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు రాణించడంతో ఇంగ్లండ్ లోని నాటింగ్ హామ్ లో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా పైచేయి సాధించింది. తేమగా ఉన్న పిచ్ పై టీమిండియా పార్ట్ టైమర్లు, స్పిన్నర్లు ఇంగ్లిష్ బ్యాట్స్ మన్ ను కట్టడి చేశారు. దీంతో, కుక్ (44), హాల్స్ (42), బెల్ (28) రాణించగా, మోర్గాన్ (10), రూట్ (2), స్టోక్స్ (2) విఫలమయ్యారు. బట్లర్ (23), వోక్స్ (6) క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 161 పరుగులు సాధించింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీయగా, రైనా, రాయుడు, జడేజా తలో వికెట్ తీసి రాణించారు.

  • Loading...

More Telugu News