: మెదక్ ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు


మెదక్ లోక్ సభ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు. ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జగ్గారెడ్డి బరిలో ఉన్నారు. కేసీఆర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News