: అధికారం కోసం, స్వార్ధం కోసం పార్టీలు మారుతున్నారు: సీతక్క


అధికారం కోసం, స్వార్ధం కోసం పార్టీలు మారుతున్నారని తెలంగాణ టీడీపీ నేత సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, టీడీపీ అనేది నేతలను తయారు చేసే కర్మాగారం లాంటిదని అన్నారు. నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారడం సరికాదని ఆమె హితవు పలికారు. పార్టీని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆమె తెలిపారు. పార్టీలు మారే నేతలు పదవులకు కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని ఆమె సూచించారు. పార్టీలో ఒకరిద్దరి పట్ల ఉండే వ్యతిరేకత మొత్తం పార్టీ వ్యతిరేకతగా మారకూడదని ఆమె హితవు చెప్పారు.

  • Loading...

More Telugu News