: కేసీఆర్ సింగపూర్ బ్రాండ్ అంబాసిడర్...జగ్గారెడ్డి తెలంగాణవాడే : నాగం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సింగపూర్ కి కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా రైతాంగం సమస్యలు తీర్చాలని అన్నారు. ఎక్కడో ఉన్న సింగపూర్ తో కాకుండా, పక్కనున్న రాష్ట్రాలతో సఖ్యత నేర్చుకోవాలని ఆయన సూచించారు. మెడికల్ కళాశాల ఫీజులు ఎందుకు పెంచారో తేటతెల్లం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రం వెలుగులోంచి చీకట్లోకి వెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి అంటే ఎందుకంత భయమని ఆయన ప్రశ్నించారు. కొండా సురేఖలా జగ్గారెడ్డి తెలంగాణ వాదులపై కాల్పులు జరపలేదని ఆయన గుర్తు చేశారు. జగ్గారెడ్డి వలస వచ్చి స్థిరపడలేదని, తెలంగాణకు చెందిన వ్యక్తేనని నాగం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News