: ఆ సినిమాలోని సీన్ ను కాపీ కొట్టలేదు: రాజమౌళి


‘శాంభవి ఐపీఎస్’ సినిమాలోని ఓ సీన్ ను ‘విక్రమార్కుడు’ సినిమా కోసం కాపీ కొట్టలేదని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వివరణ ఇచ్చారు. తాజాగా శాంభవి ఐపీఎస్ చిత్రంలోని ఓ సీన్ ను రాజమౌళి కాపీ చేశారంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘‘ఇంతకు ముందు నేను కొన్ని చిత్రాల నుంచి, నవలల నుంచి కాపీ చేశాను. కానీ, శాంభవి ఐపీఎస్ చిత్రంలోని సీన్ ను కాపీ కొట్టలేదు. చాలా కాలం క్రితం మా నాన్న ఆ సీన్ ను రాశారు. శాంభవి ఐపీఎస్ చిత్రంలోకి ఆ సీన్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ వ్యవహారం గురించి పట్టించుకునేంత టైమ్ కూడా నాకు లేదు. నా వివరణ కేవలం నన్ను విశ్వసించే వారి కోసం మాత్రమే’’ అని రాజమౌళి ఫేస్ బుక్, ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. రాజమౌళి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమా ‘విక్రమార్కుడు’లో పోలీసులను విలన్ ఎగతాళి చేస్తాడు. ఆ సమయంలో భవనంపై నుంచి పడటంతో మెడలోని బెల్ట్ ఉరిపడటంతో విలన్ మరణిస్తాడు. శాంభవి ఐపీఎస్ లో కూడా అలాంటి సీన్... ఒకటి ఉంటుంది. అయితే, ఆ సీన్ మొత్తం సేమ్ టు సేమ్ విక్రమార్కుడును పోలి ఉండటంతో కాపీ కొట్టారన్న సందేహాలు తలెత్తాయి.

  • Loading...

More Telugu News