: తుమ్మల ముహూర్తం వచ్చే నెల 5... అంతవరకు సస్పెన్సే!
ఖమ్మం జిల్లా టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు తన నిర్ణయం చెప్పేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల 5న తాను పార్టీ మారేది, లేనిది చెబుతానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్ పర్సన్ లు ఆయనను పరామర్శించారు. వచ్చే నెల 5 వరకు ఆయన పార్టీ వీడడంపై సస్పెన్స్ నెలకొంది. కాగా, ఆయన నిన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.