: 'జీతెలుగు' ఛానల్ లో 'నూరేళ్ల' సినీ సందడి
భారత సినీ పరిశ్రమ నూరేళ్లు పూర్తి చేసుకున్న ఆనంద ఘడియల్ని దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఘనంగా నిర్వహించుకుంది. ఇటీవలే చెన్నైలో ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. సినీ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమలహాసన్, దర్శకులు కె.బాలచందర్, కె.విశ్వనాథ్, నిర్మాత రామానాయుడు, బాలకృష్ణ, వెంకటేశ్, మమ్ముట్టి తదితరులు ఈ పండుగలో సందడి చేశారు. వీరితో పాటు తమిళనాడు గవర్నర్ రోశయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో నేటితరం గాయనీగాయకులు అలనాటి మధుర గీతాలను ఆలపించి... ఆహూతులను, ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. అలాగే, నేటి తరం కథానాయికలు చేసిన నృత్యాలు రంజింపజేశాయి. ఈ కార్యక్రమం రేపు (ఆగస్టు 31న) మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతోంది.