: ప్రముఖ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూత


ప్రముఖ భారతీయ చరిత్రకారుడు బిపిన్ చంద్ర కన్నుమూశారు. 86 ఏళ్ల వయసున్న చంద్ర ఈ ఉదయం 6 గంటల సమయంలో గుర్గావ్ లోని తన నివాసంలో కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. భారత స్వాత్రంత్ర్య ఉద్యమ కాలానికి సంబంధించి మన దేశ చరిత్రకారుల్లో బిపిన్ చంద్రకు ఉన్నత స్థానం ఉంది. ముఖ్యంగా మహాత్మాగాంధీ జీవితంపై ఆయనకున్న పట్టు అమోఘం. బిపిన్ చంద్ర వ్యక్తిగత విషయాల్లోకి వస్తే... ఆయనలో కమ్యూనిజం భావజాలం అధికంగా ఉండేది. ఆయన ఎన్నో రచనలు చేశారు. ఆయన రచించిన పుస్తకాలు భారతదేశంలోని వివిధ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా చేరాయి. 1928లో హిమాచల్ ప్రదేశ్ లో జన్మించిన చంద్ర... లాహోర్ లోని క్రిస్టియన్ కాలేజీ, అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. 1993లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు.

  • Loading...

More Telugu News