: నేటి మూడో వన్డే టీమిండియాకు కీలకం!
ఇంగ్లండ్ తో శనివారం జరగనున్న మూడో టెస్టుకు టీమిండియాలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. రోహిత్ స్థానంలో చెన్నైకి చెందిన మురళీ విజయ్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా, రెండో వన్డే ఆడిన సభ్యులే మూడో వన్డేలోనూ ఆడనున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మూడో వన్డేలో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. టెస్టు సీరిస్ లో పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్ జట్టు కూడా రెండో వన్డేలో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. టెస్టు సీరిస్ లో తొలి టెస్టులో విజయం సాధించిన టీమిండియా తర్వాత జరిగిన టెస్టుల్లో వరుసగా ఓటమిపాలైంది. దీనిని వన్డేల్లోనూ పునరావృతం చేయాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. అయితే భీకర ఫాంలో ఉన్న సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, కెప్టెన్ ధోనీలను అడ్డుకోవడం అంత సులభమేమీ కాదని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఎటొచ్చీ కోహ్లీ వరుస వైఫల్యం టీమిండియాను ఆందోళనలో పడేస్తోంది.