: ఐపీఎస్ అనురాధను ఏపీకి కేటాయించండి: మోడీకి చంద్రబాబు లేఖ
ఐపీఎస్ అధికారిణి అనురాధ (అడిషనల్ డీజీ)ను తెలంగాణకు కేటాయించారని... ఆమెను ఏపీకి కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆమె భర్త సురేంద్రబాబు (ఐపీఎస్)ను ఇప్పటికే ఏపీకి కేటాయించారు. దీంతో, భార్యాభర్తల అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అనురాధను కూడా ఏపీకే కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. వారి సేవలు, కార్యదక్షత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు.