: ఐక్యరాజ్య సమితి చర్చలో బాలీవుడ్ శృంగారతార
బాలీవుడ్ శృంగారతార మల్లికా శరావత్ ఐక్యరాజ్య సమితిలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. అమెరికాలో జరుగుతున్న 65వ యూఎన్డీపీఐ/ఎన్జీవో సమావేశంలో 'భారత్ లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై' ఆమె ప్రసంగించారు. భారత్ లో మహిళలపై ఇప్పటికీ కులాధిపత్యం, పురుషాధిపత్యం అధికంగా వున్నాయని మల్లిక అన్నారు. 'ఎన్ సీఆర్ బీఐ' ప్రకారం ప్రతి 20 నిమిషాలకు భారత్ లో ఓ మహిళ అత్యాచారానికి గురవుతోందని చెప్పారు. వీటికి తోడు, బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని అంతర్జాతీయ సమాజం దృష్టికి ఆమె తీసుకెళ్లారు. వీటన్నింటినీ నివారించేందుకు బలమైన చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.