: రాంగోపాల్ వర్మకు జ్ఞానోదయం అయిందా?
ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలనాల కోసం ఏదో ఒకటి మాట్లాడుతాడని విమర్శకులు అభిప్రాయపడుతుంటారు. వర్మ గురించి తెలిసిన వారు ఆయన అంతేనని, ఆయన అభిప్రాయాలు ఆయన చెబుతారని అంటారు. ఏది ఏమైనా, సంచలన వ్యాఖ్యలతో వర్మ తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. తన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడం వెనుక కారణం దేవుళ్లను దూషించడమే అని భావిస్తున్నానని పేర్కొన్న వర్మ, ఇకపై భక్తుడిగా మారాలనుకుంటున్నానని తాజాగా ట్వీట్ చేశాడు. గతంలో దేవుడే మంచోడైతే మెదక్ రైల్వే గేట్ ప్రమాదంలో అంతమంది చిన్నారులను పొట్టన పెట్టుకుంటాడా? అని వర్మ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.