: భక్తులకు శ్రీకాళహస్తి మండపంలోకి నో ఎంట్రీ


శ్రీకాళహస్తిలోని అష్టోత్తర లింగ మండపంలో స్తంభం ఒకవైపు ఒరిగిపోయింది. అకస్మాత్తుగా ఆలయ మండపం ఓ పక్కకి ఒరిగిపోవడంతో ఆందోళన చెందిన భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. మండపం ఏ క్షణాన్నైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. రాళ్లు కూడా కింద పడటంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ మండపానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ మండపం కిందనుంచే క్యూలైన్ల ద్వారా భక్తులు ప్రధాన ఆలయానికి వెళ్తుంటారు. దీనికి మరమ్మతులు చేస్తున్నామని, ఎలాంటి ప్రమాదం ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఇంతకుముందు గాలిగోపురం కూలిపోయింది. అప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి కూడా చాలా సమయం పట్టింది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కట్టించిన గాలిగోపురం అప్పట్లో కూలిపోయింది. ఇప్పుడు అష్టోత్తర లింగ మండపం కూడా కూలిపోయే స్థితిలోనే ఉండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో భక్తులను మండపంలోకి వెళ్లకుండా ఆపేశారు.

  • Loading...

More Telugu News