: పార్కులోని మహిళను మొసలి నీళ్ళలోకి లాక్కుపోయింది


ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో ఉన్న భితార్ కనికా జాతీయ పార్కులో ఓ మొసలి 38 ఏళ్ల మహిళను నీటిలోకి లాక్కెళ్లింది. బౌలా ప్రధాన్ అనే మత్స్యకార మహిళ అజగరపాటియాను క్రీక్ సమీపంలో మొసలి లాక్కెళ్లనట్టు రాజ్ నగర్ మాంగ్రోవ్ అటవీశాఖాధికారి కేదార్ కుమార్ స్వేన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. మృతురాలి కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News