: ఆ ఇద్దరు టీడీపీ నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లనున్నారా?


ఖమ్మం జిల్లా టీడీపీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ పార్టీ మారనున్నారా? మొన్నే టీడీపీ నేతల బుజ్జగింపులతో శాంతించారనుకున్న తుమ్మల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. దీంతో, ఆయన పార్టీ మారనున్నారంటూ వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. కాగా, టీఆర్ఎస్ అధినేతతో జరిగిన భేటీలో టీడీపీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ కూడా పాల్గొవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ పార్టీ మారేది తుమ్మలేనా? బాలసాని కూడా పార్టీ మారుతున్నారా? అనే దానిపై టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News