: బుల్లెట్ రైళ్లపై చర్చ... రేపే మోడీ జపాన్ పర్యటన ప్రారంభం
ప్రధాని మోడీ రేపు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచ ఆర్ధిక శక్తుల్లో అగ్రభాగాన ఉన్న జపాన్ సహాయసహకారాలను భారత్ ఆశిస్తోంది. దీంతో మోడీ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి క్యోటో నగరం చేరుకోనున్న మోడీ జపాన్ ప్రధాని షింజొ అబెతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా భారత దేశంలో బుల్లెట్ రైళ్లపై సమగ్రంగా చర్చించనున్నారు. భారత్ లో బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు జపాన్ సహాయసహకారాలు అందించనుంది. ఈ సమావేశంలో ప్రధానితో పాటు ముఖేష్ అంబానీ, అజీం ప్రేమ్ జీ వంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తల బృందం కూడా ఉండనుంది.