: ఐస్ బకెట్ ఛాలెంజ్ పిచ్చిలో సెలబ్రిటీలు... నగ్నంగా సోఫియా ఐస్ బకెట్
ఐస్ బకెట్ ఛాలెంజ్ అసలు ఉద్దేశ్యాన్ని సెలబ్రిటీలు మార్చేస్తున్నారు. తమకున్న ఎంటర్ టైన్ మెంట్ పిచ్చితో దాని ఉద్దేశ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒళ్లంతా కనిపించేలాంటి పిచ్చి చేష్టతో ఐస్ బకెట్ ఛాలెంజ్ చేసిన పూనమ్ పాండ్ ఫేస్ బుక్ ఖాతాను మూసేసేలా చేసుకోగా, మరో సెలబ్రిటీ నగ్నంగా ఐస్ బకెట్ చాలెంజ్ స్వీకరించి...అభిమానులకు అందాల విందు చేసింది. ఏఎల్ఎస్ వ్యాధి నివారణ పరిశోధన కోసం చేసిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ను బిగ్ బాస్ సుందరి సోఫియా హయత్ బీచ్ కుర్చీపై నగ్నంగా పడుకుని స్వీకరించి ఫోటోలు షేర్ చేసింది. దీనిపై అభిమానులు విమర్శలు కురిపిస్తున్నప్పటికీ ఫోటోలు మాత్రం ఎగబడి చూస్తున్నట్టు సమాచారం.