: గాయంతో జట్టు నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ


స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఇంగ్లండ్ తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ తో పాటు ఏకైక టి20 మ్యాచ్ కూ రోహిత్ దూరమయ్యాడు. రోహిత్ కుడిచేతి మధ్య వేలికి గాయమైంది. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ రోహిత్ స్థానంలో మురళీ విజయ్ ని ఎంపిక చేసింది. ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో రాణించడంతో సెలక్టర్లు విజయ్ కి ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, టీమిండియా, ఇంగ్లండ్ ల మధ్య మూడో వన్డే శనివారం జరగనుంది. ఈ ఐదు వన్డేల సిరీస్ లో తొలి వన్డే వర్షార్పణం కాగా, రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. తద్వారా సిరీస్ లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News