: తేలికపాటి హెలికాప్టర్ల కొనుగోలు టెండర్ల రద్దు
తేలికపాటి హెలికాప్టర్ల కొనుగోలు టెండర్లను రక్షణ శాఖ రద్దు చేసింది. దేశ రక్షణ రంగ అవసరాల కోసం ఆరువేల కోట్ల రూపాయలతో 197 తేలికపాటి హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లను కూడా పిలిచింది. అమెరికా, రష్యా, బ్రిటన్ మరికొన్ని దేశాలకు చెందిన రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు టెండర్లలో పాలుపంచుకున్నాయి. అయితే, రక్షణ శాఖ అకస్మాత్తుగా హెలికాప్టర్ల కొనుగోలు నిలిపేయాలని నిర్ణయించింది. దీంతో టెండర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.