: హైదరాబాదులో 'రోడ్ డాక్టర్'!


హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతాల్లో సైతం రోడ్లు గతుకులు, గుంతలమయం. ఆదమరిస్తే అంతే సంగతులు. ముఖ్యంగా, వర్షాకాలంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ కష్టాలన్నింటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఓ యంత్రంతో చెక్ పెట్టనుంది. దాన్ని 'రోడ్ డాక్టర్' అని కూడా పిలుస్తారు. 90 రోజుల్లోగా నగరంలోని రోడ్లపై గుంతలను రూపుమాపాలనుకుంటున్న జీహెచ్ఎంసీ, ఈమేరకు ఐదు రోడ్ డాక్టర్లను రంగంలోకి దించాలని నిర్ణయించింది. హైదరాబాదులోని ఒక్కో జోన్ కు ఒక్కో యంత్రాన్ని కేటాయిస్తారు. దీనిపై నగర మేయర్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఈ మెషీన్ తో రోడ్లపై గుంతలను త్వరగా పూడ్చవచ్చని, అలా పూడ్చిన గుంతలు ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉంటాయని తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, గుంతల్లో నీరు నిలిచి ఉన్నా, ఈ నూతన యంత్రంతో నిరాటంకంగా మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఒక్కో గుంత పూడ్చేందుకు 30 నిమిషాలు తీసుకుంటుందని, దీనితో రోజుకు 40 ప్రదేశాల్లోని గుంతలు పూడ్చవచ్చని జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News