: టీటీడీ ఆస్తుల విలువ రూ.9,800కోట్లు... వెేంకటేశ్వరుడి ఆభరణాల విలువ రూ.50వేల కోట్లు


తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ ఎత్తున భూములతో పాటు షాపింగ్ కాంప్లెక్సులు, కల్యాణ మండపాలు... ఇలా చాలా రకాల ఆస్తులు ఉన్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా... కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతో పాటు నేపాల్ దేశంలో కూడా టీటీడీకి ఆస్తులు ఉన్నాయి. నిన్న శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ శాసనసభ్యుడు అడిగిన ప్రశ్నకు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు టీటీడీ ఆస్తుల విషయంపై ప్రకటన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 4,658 ఎకరాల భూమి ఉందని... మిగతా రాష్ట్రాలు, నేపాల్ దేశంతో కలుపుకుని మరో 130 ఎకరాలు భూమి ఉందని ఆయన ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.9,800 కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు.అలాగే తిరుమల శ్రీవెేంకటేశ్వరుడి ఆభరణాల విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని మంత్రి ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు ఆక్రమణదారుల పాలుకాకుండా తమ ప్రభుత్వం అన్ని రకాల భద్రతా చర్యలను తీసుకుంటుందని మాణిక్యాలరావు శాసససభకు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News