: తెల్లవారుజాము శృంగారం అన్ని విధాల మేలట!
శరీరానికి వ్యాయామం చాలా అవసరం. అందుకే తెల్లవారుజామున లేచి జాగింగ్కు వెళ్లడమో లేదా వాకింగ్ చేయడమో చేస్తుంటాం. నిపుణులు వ్యాయామం, వాకింగ్, జాగింగ్ కంటే ఉత్తమమైన వ్యాయామాన్ని సూచిస్తున్నారు. వీరు సూచించినట్టు చేస్తే శరీరంతో పాటు మనసు కూడా ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుకుగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ చేయాల్సిందేమిటంటే... తెల్లవారుజామున శృంగారం. అవును, తెల్లవారుజామున శృంగారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం లభిస్తాయని, తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డెబ్బీ హెర్బెనిక్ అనే సెక్సువల్ హెల్త్ వైద్యుడు స్పష్టం చేశారు. తెల్లవారుజాము శృంగారం వల్ల వచ్చే ఉత్తేజాన్ని, ముఖంలో వచ్చే మెరుపును ఇతరులు సులభంగా గుర్తించగలరని ఆయన పేర్కొన్నారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుందని, దానివల్ల చర్మం, జుట్టు కూడా బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయని ఆయన తెలిపారు. శరీరంలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ విడుదలవ్వడం వల్ల వయసు ప్రభావంతో వచ్చే సమస్యలు కూడా నెమ్మదిస్తాయని ఆయన వివరించారు.